సైబర్ మాయ..!
● ఉమ్మడి పాలమూరును బెంబేలెత్తిస్తున్న
సైబర్ మోసాలు
● గత సంవత్సరంతో పోలిస్తే
15.42 శాతం పెరిగిన నేరాలు
● ఈ ఏడాది అమాయకుల నుంచి
రూ.10 కోట్ల మేర దోపిడీ
● అన్ని జిల్లాల్లోనూ అంతంత మాత్రంగానే
స్వాధీనం
● ‘గోల్డెన్ అవర్’లోనే సొమ్ము రికవరీకి అవకాశం
దైనందిన జీవితంలో డిజిటలైజేషన్ వినియోగం పెరగడంతో ప్రజలు ఆన్‌లైన్, మొబైల్ సేవలపై ఆధారపడుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. రకరకాల పేర్ల్లు, లింక్‌లతో మభ్యపెట్టి అమాయకులను నిలువు దోపిడీ చేస్తున్నారు. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకున్న ఎందరో డబ్బులతో పాటు ప్రాణాలను పొగొట్టుకుంటున్నారు. ఆన్‌లైన్ మోసానికి గురైన వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు ఇటీవల బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాను సైబర్ మాయ కమ్మేసిన తీరు.. గత ఏడాదితో పోలిస్తే పెరిగిన సైబర్ మోసాల కేసుల శాతం.. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. – సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment