సమష్టి కృషితోనే జిల్లా సమగ్రాభివృద్ధి
నాగర్‌కర్నూల్: అన్నిశాఖల అధికారులందరూ కలిసికట్టుగా పనిచేస్తూ.. జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఆర్డీఓలు కలెక్టర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అధికారులందరూ నూతనోత్సాహంతో పనిచేసి, అర్హులకు సంక్షేమ పథకాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపాలని కోరారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరికీ మంచి జరగాలని కాంక్షించారు. యువత సన్మార్గంలో పయనిస్తూ.. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కలెక్టర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన వారిలో జిల్లా అధికారులు చిన్న ఓబులేషు, రాంలాల్, స్వరాజ్యలక్ష్మి, రామ్మోహన్‌రావు, ఖాజా అప్సర్‌అలీ, శ్రవణ్‌కుమార్, రమాదేవి, శ్రీనివాసారెడ్డి, సీతారాం నాయక్, కలెక్టరేట్ ఏఓ చంద్రశేఖర్, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment