ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఆందోళన
అచ్చంపేట రూరల్: పట్టణంలోని సర్వేనంబర్ 293లో గల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దేశ్యానాయక్ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అనంతరం కార్యాలయంలో ఉన్న సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ గైరాను భూమిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారని వివరించారు. ఆ భూమిని ప్లాట్లుగా మార్చారని తెలిపారు. రూ. 50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రభుత్వము వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు. పేదలకు భూమి పంచే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అలాగే పట్టణంలోని వలపట్ల కాలనీకి చెందిన ఎంబీ జాయిన చర్చికి ఆ స్థలం కేటాయించాలని విన్నవించారు. కార్యక్రమంలో మల్లేష్, శంకర్‌నాయక్, నాగరాజు, నిర్మల, రాములు, ప్రభాకర్, జాన్‌రాజు, సీమోను, అనీల్, స్వామి, సుధాకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment