‘సదరం’ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోండి
నాగర్‌కర్నూల్‌రూరల్: సదరం సర్టిఫికెట్ల రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని డీఆర్డీఓ చిన్న ఓబులేషు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శారీరక దివ్యాంగులకు ఈ నెల 7 నుంచి 21వ తేదీ వరకు జిల్లా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. వినికిడి లోపం ఉన్న వారికి 20న, కంటిలోపం గల దివ్యాంగులకు 9నుంచి 27వ తేదీ వరకు, మానసిక దివ్యాంగులకు 8 నుంచి 16వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించి.. అర్హులైన వారికి సదరం సర్టిఫికెట్లు రెన్యువల్ చేస్తారని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో శుక్రవారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఉద్యోగ భద్రత
కల్పించండి
కందనూలు: జిల్లా కేంద్రంలో సమగ్రశిక్ష ఉద్యోగులు గురువారం మహా ర్యాలీ చేపట్టారు. అనంతరం అంబేడ్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్రశిక్ష ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు మురళి మాట్లాడుతూ.. ఉద్యోగ భద్రత కోసం 24 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎన్నికల సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించి, పేస్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు విష్ణు, శివలింగం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
హామీలను అమలుపర్చాలి
నాగర్‌కర్నూల్‌రూరల్: సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుపర్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని సివిల్ సప్లై స్టాక్ పాయింట్ వద్ద హమాలీల నిరవధిక సమ్మెను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు చెల్లించే ఎగుమతి, దిగుమతి రేట్ల ఒప్పందం డిసెంబర్ 2023తో ముగిసిందన్నారు. రేట్ల పెంపుకై కార్మిక సంఘాల సమక్షంలో అధికారులు గతేడాది అక్టోబర్ 3న చర్చలు జరిపినట్లు చెప్పారు. రూ. 26 ఉన్న రేటును రూ. 29 వరకు అదనంగా పెంచారని.. ఆ రేట్లను 2024 జనవరి నుంచి అమలు చేస్తామని.. ఏరియర్స్‌తో సహా చెల్లిస్తామని.. మహిళా స్వీపర్‌లకు గోదాముల సామర్థ్యం మేరకు ప్రస్తుతం ఉన్న వేతనంపై రూ. వెయ్యి అదనంగా ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ మేరకు హామీల అమలుకు తక్షణమే జీఓ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment