అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు
నాగర్‌కర్నూల్: ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వివిధ సమస్యలపై 26 అర్జీలు అందాయని తెలిపారు. ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ.. సమస్యలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
భూసేకరణ విభాగంలో
పనిచేసేందుకు అవకాశం..
భూసేకరణ అంశంపై అవగాహన ఉన్న రెవెన్యూ రిటైర్డ్ ఉద్యోగులకు భూసేకరణ విభాగం తహసీల్దార్, నయాబ్ తహసీల్దార్‌గా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కలెక్టర్ బదావత్ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల వారు కలెక్టరేట్‌లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్‌ను నేరుగా లేదా 91009 01430 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment