రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరవలేనిది
కందనూలు: తెలంగాణ రాష్ట్ర సాధనలో కళాకారుల పాత్ర మరవలేనిదని ఎమ్మెల్యే డా.కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన జిల్లాస్థాయి జానపద కళాకారుల ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జానపద కళాకారులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎంతటి వారినైనా కదిలించే శక్తి ఒక్క పాటకు మాత్రమే ఉంటుందని.. అలాంటి కళాకారులకు గత ప్రభుత్వంలో సరైన గుర్తింపు దక్కలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కళాకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని.. వివిధ సందర్భాల్లో ఘనంగా సత్కరిస్తున్నట్లు గుర్తుచేశారు. జిల్లా కేంద్రంలో అత్యాధునిక హంగులతో కళాభవన్ నిర్మాణానికి సంబంధిత మంత్రితో కలిసి త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. అనంతరం రాష్ట్ర కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షుడు వంగ శ్రీనివాస్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు పి.కృష్ణయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు..
తాడూరు: కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే రాజేష్‌రెడ్డి చెప్పారు. తాడూరు మండలం నాగదేవ్‌పల్లిలో గ్రామపంచాయతీ కార్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శకంగా పాలన అందించేందుకు ప్రతి గ్రామంలో పంచాయతీ భవనం అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి నూతన భవనాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధుల మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సింగిల్‌విండో చైర్మన్ రాంచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment