యోగి వేమన జయంతిని అధికారికంగా జరపాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్రస్థాయిలో యోగి వేమన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ సామల పాపిరెడ్డి అన్నారు. పాలమూరు రెడ్డి సేవా సమితి ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం విశ్వకవి యోగి వేమన జయంతిని స్థానిక రాజా బహదూర్‌రెడ్డి కన్వెన్షన్ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వేమన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాపిరెడ్డి మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గానికే కాకుండా యోగి వేమన అన్ని కులాల అభిమాన కవి, మార్గదర్శకుడు, సామాజికవేత్త అన్నారు. వేమన రాసిన పద్యాలను సమీకరించి ఒక కావ్యంగా తయారు చేయాలని కవులను కోరారు. రాష్ట్రస్థాయిలో రెడ్ల సమైక్యత, సంఘటీకరణ కోసం సేవాభావంతో స్వచ్ఛందంగా సేవలందించే ఒక రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు కావాలన్న ధృడసంకల్పంతో తాము కృషి చేస్తున్నామన్నారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత మాట్లాడుతూ యోగి వేమన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేలా సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. అనంతరం రెడ్డిసేవా సమితి క్యాలండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రెడ్డిసేవా సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, కోశాధికారి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షులు వెంకట్రామరెడ్డి, అనంతరెడ్డి, సురేందర్‌రెడ్డి, కోటేశ్వర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, రాఘవరెడ్డి, యాదిరెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, ప్రవీణ్‌రెడ్డి, కృష్ణారెడ్డి, జైపాల్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, దశరథరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సరస్వతి, స్వరూప, శోభ, అనిత, హేమలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment