విద్యా ప్రమాణాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

విద్యా ప్రమాణాలు మెరుగు

Published Fri, Oct 4 2024 3:18 AM | Last Updated on Fri, Oct 4 2024 3:18 AM

-

వర్క్‌షాప్‌లు విద్యా ప్రమాణాలు మెరుగు పడతాయని కృష్ణా యూనివర్సిటీ మాజీ వైస్‌ చాన్స్‌లర్‌ వెంకటయ్య అన్నారు.

పూర్తిస్థాయి నీటిమట్టం :

590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 588.20 అడుగులు

ఇన్‌ఫ్లో : 51,828 క్యూసెక్కులు

అవుట్‌ ఫ్లో : 51,828 క్యూసెక్కులు

విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 28,704 క్యూసెక్కులు

కుడికాల్వ ద్వారా : 10,867 క్యూసెక్కులు

ఎడమకాల్వ ద్వారా : 9,257 క్యూసెక్కులు

ఏఎమ్మార్పీకి : 2,400

వరద కాల్వకు : 600

పూర్తిస్థాయి నీటి మట్టం :

645 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం :

644.20 అడుగులు

ఇన్‌ఫ్లో : 2,414.91 క్యూసెక్కులు

అవుట్‌ఫ్లో : 1,438.10 క్యూసెక్కులు

ఎడమకాల్వకు : 315.90 క్యూసెక్కులు

కుడికాల్వకు : 170.70 క్యూసెక్కులు

- 8లో

నల్లగొండ క్రైం: ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలువురు ఎస్‌ఐలపై అవినీతి ఆరోపణలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు కొరడా ఝళిపించారు. పలువురు ఎస్‌ఐలను వీఆర్‌లో ఉంచగా.. మరికొంత మందిని ప్రాధాన్యత లేని స్థానాలకు పంపించారు. ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైన నల్లగొండ జిల్లా హాలియా ఎస్‌ఐ సతీష్‌రెడ్డి, వాడపల్లి ఎస్‌ఐ రవిని వీఆర్‌లో ఉంచుతూ మల్టీజోన్‌–2 ఐజీ సత్యనారాయణ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కొండమల్లేపల్లి హోంగార్డు యాదగిరిని హెడ్‌క్వార్టర్‌కు అటాచ్‌ చేశా రు. అంతేకాకుండా వారం, పది రోజుల క్రితం సూ ర్యాపేట జిల్లా తుంగతుర్తి, ఆత్మకూర్‌(ఎస్‌), పెన్‌పహాడ్‌ ఎస్‌ఐలను వీఆర్‌లో ఉంచారు. అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూరు, మాడ్గులపల్లి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం ఎస్‌ఐలకు స్థాన చలనం కల్పించారు. కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్ష, పరోక్ష సహకారం ఉండటంతో శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

అవినీతి ఆరోపణలతో ఎస్‌ఐలపై బదిలీ వేటు

ఫ తాజాగా ఇద్దరు ఎస్‌ఐలు వీఆర్‌కు..

ఫ హెడ్‌క్వార్టర్‌కు ఓ హోంగార్డు అటాచ్‌

ఫ మల్టీజోన్‌–2 ఐజీ ఉత్తర్వులు జారీ

ఫ పది రోజుల క్రితం వీఆర్‌కు

ముగ్గురు ఎస్‌ఐలు

ఫ మరో 9మంది ఎస్‌ఐలకు స్థాన చలనం

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయాలి...

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను కట్టడి చేయడంలో విఫలమైతే సంబంధిత పోలీస్‌ అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు. రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిఘా వర్గాల నివేదిక, ఇతర సమాచారం ఆధారంగా పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement