మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక ఏకగ్రీవం
నకిరేకల్: నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురువారం ప్రశాంతంగా ముగిసింది. చైర్‌పర్సన్‌గా మున్సిపాలిటీలోని 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్ (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల ప్రత్యేకాధికారి, నల్లగొండ ఇన్‌చార్జ్ ఆర్డీఓ శ్రీదేవి ప్రకటించారు. ఆగస్టు 12న నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్ (బీఆర్‌ఎస్) పై అధికార కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 16 మంది మున్సిపల్ కౌన్సిలర్లు అవిశ్వాస పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నూతన చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. మున్సిపాలిటీలో మొత్తం 20 మంది వార్డు కౌన్సిలర్లు ఉండగా.. చైర్మన్ ఎన్నిక కోసం నల్లగొండ ఇన్‌చార్జ్ ఆర్డీఓ శ్రీదేవి సమక్షంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి 17 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్‌ఎస్‌కు చెందిన మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు మరో ఇద్దరు కౌన్సిలర్లు పల్లె విజయ్, కొండ శ్రీను గైర్హాజరయ్యారు. చైర్మన్ ఎన్నిక కోసం కాంగ్రెస్‌కు 16 మంది కౌన్సిలర్లు ఉండటంతో చైర్ పర్సన్‌గా 9వ వార్డు కౌన్సిలర్ చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్ పేరును 1వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కందాల భిక్షంరెడ్డి ప్రతిపాదించారు. ఆమెను 16వ వార్డు కౌన్సిలర్ గర్శకోటి సైదులు బలపర్చారు. చైర్మన్ ఎన్నికకు పోటీ లేకపోవడంతో చైర్ పర్సన్‌గా ప్రతిపాదించిన చౌగోని రజితాశ్రీనివాస్‌గౌడ్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లు ఎన్నిక ప్రత్యేకాధికారి శ్రీదేవి ప్రకటించారు. ఈమేరకు చౌగోని రజితకు నియామకంపత్రం అందజేశారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బాలయ్య, వైస్ చైర్‌పర్సన్ మురారిశెట్టి ఉమారాణికృష్ణమూర్తి, వార్డు కౌన్సిలర్లు కందాల భిక్షంరెడ్డి, రాచకొండ సునీల్, పొడుగు స్వాతి, గాజుల సుకన్య, వంటెపాక సోమలక్ష్మి, మట్టిపల్లి కవితా, పన్నాల పావని, చౌగోని అఖిల, బానోతు వెంకన్న, పోతులు సునీత, గడ్డం లక్ష్మీనర్సింహస్వామి, యాసారపు లక్ష్మి, గర్శకోటి సైదులు, దైద స్వప్న, చౌగోని రాములమ్మ పాల్గొన్నారు.
ఫ నకిరేకల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై న
9వ వార్డు కౌన్సిలర్ రజిత
Comments
Please login to add a commentAdd a comment