సీఎంఆర్ సేకరణకు సహకరించాలి
నల్లగొండ: కష్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) సేకరణకు రైస్ మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ కోరారు. బుధవారం ఆమె నల్లగొండలోని కలెక్టరేట్‌లో రైస్ మిల్లర్లతో 2024–25 ధాన్యం సేకరణ, రైస్ మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటాయింపు, అదనపు మిల్లింగ్ చార్జీలపై ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఈ వానాకాలం ధాన్యం సేకరణలో రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఇప్పటి వరకు కష్టం మిల్లింగ్ రైస్( సీఎంఆర్)లో ఎలాంటి ఆరోపణలు లేని రైస్ మిల్లులకు 10 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామన్నారు. బకాయిలు ఉండి తదుపరి వాటిని చెల్లిస్తే 20 శాతం బ్యాంకు గ్యారంటీతో సీఎంఆర్ ధాన్యం కేటాయిస్తామన్నారు. మిల్లర్లు పలు సమస్యలను ప్రస్తావించగా రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌరసరఫరాల మేనేజర్ హరీష్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, రైస్ మిల్లర్స్ సోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
కుటుంబ సర్వే పకడ్బందీగా చేపట్టాలి
నల్లగొండ టూటౌన్: ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ అన్నారు. బుధవారం నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో సమగ్ర కుటుంబ సర్వేపై ఎన్యూమరేటర్లకు నిర్వహించిన శిక్షణకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పాలసీల రూపకల్పనకు సమగ్ర కుటుంబ సర్వే ఉపయోగపడుతుందన్నారు. ఎన్యూమరేటర్లు సమగ్ర కుటుంబ సర్వేను తప్పులు లేకుండా నిర్వహించాలన్నారు. సర్వే సందర్భంగా ఏ ఇంటిని వదిలిపెట్టకూడదని, సర్వేపూర్తి చేసిన ఇంటికి స్టిక్కర్ అతికించాలని చెప్పారు. ఈ శిక్షణలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠీ
Comments
Please login to add a commentAdd a comment