ఎంబీఏ ఫలితాలు విడుదల
నల్లగొండ రూరల్: మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎంబీఏ జనరల్, ఎంబీఏ టీటీఎం సెమిస్టర్ 1, 2, 3, 4 రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఫలితాలను బుధవారం విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఉపేందర్‌రెడ్డి తెలిపారు. ఎంబీఏ జనరల్ 4వ సెమిస్టర్‌లో 200 మంది విద్యార్థులకు గాను 191 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపారు.
రిటైర్డ్ ఏసీపీ అంజయ్యకు సతీవియోగం
అనంతగిరి: మండలంలోని కిష్టాపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఏసీపీ బుడిగె అంజయ్య సతీమణి బుడిగె పద్మావతి(55) అనారోగ్యంతో బుధవారం మృతిచెందారు. గత 40 రోజులుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు బంధువులు తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని సాయంత్రం కిష్టాపురంలోని ఇంటికి తీసుకురాగా.. వివిధ సంఘాల నాయకులు, రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, ముదిరాజ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చొప్పరి శంకర్, వాయిలసింగారం మత్య్ససహకార సంఘం చైర్మన్ కంటు నాగార్జున నివాళులర్పించారు.
గంజాయి తరలిస్తున్న
యువకుల రిమాండ్
భువనగిరి క్రైం: గంజాయి తరలిస్తూ మంగళవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులో పట్టుబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లాకు చెందిన మల్లు వేణుగోపాల్‌రెడ్డి, భువనగిరి మండలం బొల్లెపల్లి గ్రామానికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, గుమ్మడెల్లి అర్జున్‌ను బుధవారం పోలీసులు కోర్టుకు రిమాండ్ చేశారు. మరో బాలుడిని నల్ల గొండ జువెలిన్ కోర్టుకు తరలించినట్లు రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు. రెండు కార్లు, 35 కిలోల గంజాయి, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment