చీకటిని పారదోలి.. వెలుగులు నింపి
రామగిరి(నల్లగొండ), నకిరేకల్, యాదగిరిగుట్ట : విజయానికి ప్రతీకగా.. చీకటిని పారదోలి జీవితాల్లో వెలుగులు నింపే దీపావళి రానే వచ్చింది. లక్ష్మీ పూజలు, నోములు, వ్రతాలు ఆచరించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. ప్రత్యేక పూజల్లో భాగంగా కేదారేశ్వర వ్రతం కొందరు దీపావళి రోజు జరుపుకుంటే మరికొందరు కార్తీకమాసంలో పౌర్ణమి రోజున నిర్వహిస్తారు. ఆది దంపతులుగా భావించే పార్వతీపరమేశ్వరులను పూజిస్తూ ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ నోము నోచుకోవడం వల్ల అష్టఐశ్వర్యాలు కలుగుతాయని, అన్నవస్త్రాలకు లోటు ఉండదని నమ్మకం. కాగా.. ఈ నోమును ఎంపుకపు నోము, రాశి నోము అని రెండు రకాలుగా జరుపుకుటారు.
దీపావళి పండుగ ఇలా వచ్చింది..
పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను హింసలు పెడుతుండగా శ్రీకష్ణుడు సత్యభామతో కలిసి అతడిని వధించేందుకు వెళ్తాడని, ఆ సందర్భంలో సత్యభామ నరకాసురుడిని వధించడంతో ప్రజలు ఆనందంతో దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా శ్రీరాముడు అరణ్యవాసాన్ని పూర్తిచేసుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజుకు గుర్తుగా దీపావళి చేసుకుంటారని ప్రతీతి. అదేవిధంగా బలి చక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామనావతారంలో భూమిలోకి అణగదొక్కిన రోజుగా పురాణాల్లో ఉంది.
టపాసులు ప్రత్యేకం
దీపావళి అంటేనే టపాసులు ప్రత్యేకం. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు టపాసులు కాలుస్తూ ఆనందంగా గడుపుతారు. అయితే పర్యావరణానికి మేలు జరిగేలా పండుగను జరుపుకోవాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు.
నేడు దీపావళి పండుగ
ఫ నోములు, వ్రతాలకు సిద్ధమైన ప్రజలు
ఫ కొనుగోళ్లతో సందడిగా మార్కెట్‌లు
Comments
Please login to add a commentAdd a comment