ఖాతాల్లో త్వరగా డబ్బులు జమ చేయాలి
నల్లగొండ: ధాన్యం అమ్మిన రైతుల బాం్యకు ఖతాల్లో త్వరితగతిన డబ్బులు జమ అయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠీ ఆదేశించారు. బుధవారం ఆమె నల్లగొండ సమీపంలోని ఆర్జాలబావి, ఎస్ఎల్బీసీ బత్తాయి మార్కెట్ల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముచ్చడించారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని కొనుగోలు కేంద్రాలకు తెచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రూ.500 బోనస్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఛాయాదేవి, జిల్లా సహకార శాఖ అధికారి పత్యానాయక్, పీఏసీఎస్ చైర్మన్ నాగరత్నం రాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment