నిబంధనల ప్రకారం సర్వే నిర్వహించాలి
ఫ జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి
త్రిపురారం: సిబ్బందికి కేటాయించిన ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పక్కాగా కుటుంబ సర్వే నిర్వహించాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి సూచించారు. బుధవారం త్రిపురారం మండలం కంపాసాగర్ టీఎస్ మోడల్ స్కూల్‌లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సమగ్ర కుటుంబ సర్వేపై సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. సర్వే ఫారంలో ఉన్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని వివరాలు సేకరించాలన్నారు. సర్వేపై నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. కార్యక్రమలో త్రిపురారం ఎంపీడీఓ విజయకుమారి, తహసీల్దార్ గాజుల ప్రమీల, ఎంఈఓ రవినాయక్, వ్యవసాయాధికారి పార్వతి చౌహాన్, ఏపీఓ శ్యామల, ఎంపీఓ సుదీర్‌కుమార్, ఏపీఎం అశోక్, ఏఎస్‌ఓ దీప, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సదర్ సమ్మేళనానికి మంత్రి విరాళం
నల్లగొండ: పట్టణంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో యాదవుల ఆధ్వర్యంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పంపిన రూ.లక్ష విరాళాన్ని కాంగ్రెస్ పార్టీ నల్లగొండ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి బుధవారం యాదవ సంఘం నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, యాదవ సంఘం నాయకులు అల్లి సుభాష్‌యాదవ్, గుండెబోయిన వెంకన్నయాదవ్, మద్ది శ్రీనివాస్‌యాదవ్, కడారి కోటి, గోగుల గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment