ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
సాక్షి, యాదాద్రి: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జీ. వీరారెడ్డి అన్నారు. బుధవారం ఆయన కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్‌లు, ప్యాడీ క్లీనర్లు, తేమ మిషన్లు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు ఆయాశాఖల అధికారులు సమకూర్చుకోవాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో సన్న, దొడ్డు రకం కేంద్రాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలన్నారు. సన్నధాన్యం గోనె సంచులను ఎర్ర దారంతో, దొడ్డు రకం ధాన్యం గోనె సంచులను ఆకుపచ్చ దారంతో కుట్టాలన్నారు. దొడ్డు ధాన్యం రవాణా చేసి సన్న ధాన్యంగా ఎంట్రీ చేస్తే ఆ ధాన్యం మొత్తం కొనుగోలు కేంద్రాల నుంచి వసూలు చేస్తామన్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన లారీల నుంచి 8గంటల లోపే దిగుమతి చేసుకోవాలన్నారు. మిల్లుల్లో హమాలీల కొరత లేకుండా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సమావేశంలో వ్యవసాయ, సివిల్ సప్‌లై, మార్కెటింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ టెలికాన్ఫరెన్స్
జిల్లాలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు, సమగ్ర కుటంబ సర్వేపై కలెక్టర్ హనుమంతరావు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలన్నారు. సమగ్ర కుటుంబ సర్వే నిబంధనల ప్రకారం పూర్తి చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment