సమగ్ర సర్వేకు సహకరించాలి
నల్లగొండ: సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. బుధవారం జిల్లాలో ప్రారంభమైన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను నల్లగొండలోని బీటీఎస్ కాలనీలో ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచుతామని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. సర్వే కోసం వచ్చిన ఎన్యూమరేటర్లకు వాస్తవ సమాచారాన్ని తెలపాలన్నారు. ఈ నెల 8వ తేదీ వరకు స్టిక్కర్లు అంటించి ఇళ్ల జాబితాను రూపొందించి అనంతరం సర్వే ఫార్మాట్‌లోని సుమారు 75 కాలమ్స్‌లో వివరాలు సేకరిస్తామన్నారు. ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ధరణి పట్టాదారు పాస్ బుక్ వంటివి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి ఇంటిని సందర్శించినట్లుగా స్టిక్కర్ అతికించాలని చెప్పారు. మూడు స్థాయిల్లో సర్వేను పర్యవేక్షించేందుకు సూపర్‌వైజర్లు, మండల ప్రత్యేక అధికారి లేదా మున్సిపల్ కమిషనర్, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్ నోడల్ అధికారులుగా నియమించామన్నారు. అంతేకాకుండా రోజూ టెలీకాన్ఫరెన్స్, ఆకస్మిక తనిఖీల ద్వారా సర్వేను పర్యవేక్షిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదాము తనిఖీ
జిల్లా కలెక్టరేట్ ఆవరణలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటుచేసిన సెక్యూరిటీ, పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించినట్టు అధికారులు తెలిపారు. ఆమె వెంట కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు విజయ్, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.
వేరు కాపురం ఉంటేనే
కుటుంబంగా గుర్తించాలి
మునుగోడు: తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరు కాపురం ఉంటేనే నూతన కుటుంబంగా గుర్తించాలనికలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యుమరేటర్లకు సూచించారు. బుధవారం ఆమె మునుగోడు మండలం గూడపూర్ గ్రామంలో ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను పరిశీలించారు. పది ఇళ్లకు నేరుగా వెళ్లిన ఆమె సర్వే సిబ్బంది మీ ఇంటికి వచ్చారా.. మిమ్మల్ని ఏమైనా ప్రశ్నలు అడిగారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్వే చేస్తున్న తీరుని పలిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిదండ్రులు, పక్కవారు చెబితే ఆ వివరాలను నమోదు చేయవద్దన్నారు.పంచాయతీ కార్యదర్శిపై ఆగ్రహం
గూడపూర్‌లో సర్వే పరిశీలనకు కలెక్టర్ వచ్చిన సమయంలో పంచాయతీ కార్యదర్శి సరిత అందుబాటులో లేకపోవడం, ఒకే ఇంటికి రెండు, మూడు స్టిక్కర్లు ఉండడం.. గ్రామంలో పారిశుద్ధ్యలోపాన్ని గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు గ్రామాన్ని సందర్శిస్తానని అప్పటిలోగా పారిశుద్ధ్య లోపం ఉండొద్దని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆమె మునుగోడు మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు కార్తీకేయ కాటన్ మిల్లులోని సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి నిబంధనల ప్రకారం తేమ ఉండేలా తమ వడ్లు, పత్తిని ఆరబెట్టుకొని కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్ ఎం.నరేందర్, ఎంపీడీఓ విజయభాస్కర్, ఆర్‌ఐ రామచంద్రయ్య, చండూరు మార్కెట్ కార్యదర్శి రవి, సీసీఐ కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి ఉన్నారు.
ఫ వివరాలు గోప్యంగా ఉంచుతాం
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
ఫ నల్లగొండ, మునుగోడులో సామాజిక సర్వే పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment