విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి
కనగల్: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండలం చిన్నమాదారంలో స్థానిక ప్రభ్తువ ఉన్నత పాఠశాల విద్యార్థులకు కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన షూ పంపిణీ కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డుకాదని, బాగా చదివే విద్యార్థులకు ప్రతీక్ ఫౌండేషన్ ఎంతో ఆర్థిక సహకారం అందిస్తుందన్నారు. కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ కోచైర్మన్ ఎంవీ గోనారెడ్డి మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గతంలో ఈ పాఠశాలను సందర్శించిన సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలో భాగంగా షూలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పాఠశాలకు కావాల్సిన క్రీడల సామగ్రిని అందిస్తామని, తరగతి గదులకు రంగులు వేస్తామని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి బి.భిక్షపతి మాట్లాడుతూ ప్రతీక్ ఫౌండేషన్ సేవలు ప్రశంసనీయమన్నారు. విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో పది గ్రేడింగ్ పాయింట్లు సాధించి పాఠశాలకు మంచి పేరుతేవాలన్నారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. పాఠశాల గెజిటెడ్ హెచ్‌ఎం వి.పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కనగల్ మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్‌లు దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, దేప నరేందర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment