రేణుకా ఎల్లమ్మ హుండీ ఆదాయం రూ.13.82లక్షలు
కనగల్: మండలంలోని దర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీరేణుకా ఎల్లమ్మ ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. 87 రోజులకు గాను రూ.13,82,680 ఆదాయం సమకూరిందని ఆలయ ఈఓ జల్లేపల్లి జయరామయ్య, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ బి.సుమతి తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీహెచ్.వెంకట్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ సీహెచ్.నగేష్‌గౌడ్, మాజీ చైర్మన్ ఎన్.ముత్తయ్య, సీనియర్ అసిస్టెంట్లు జె.చంద్రయ్య, జి.నాగేశ్వర్రావు, జూనియర్ అసిస్టెంట్లు కె.ఉపేందర్‌రెడ్డి, కె.రాజయ్య, ఎన్.ఆంజనేయులు, జె.నాగరాజు, సీహెచ్.శ్రీకరణ్, ఎం.రాజు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment