ప్రమాద బీమాను సద్వినియోగం చేసుకోవాలి
నల్లగొండ: మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా పొదుపు సంఘాల మహిళలకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రమాద బీమా, రుణ బీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలని డీఆర్‌డీఓ వై.శేఖర్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న బీమా పథకాలపై సెర్ప్, సీ్త్ర నిధి సిబ్బందికి డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో బుధవారం నల్లగొండలోనీ టీటీడీసీ కార్యాలయంలో నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. ప్రమాద బీమా, రుణబీమా ద్వారా మహిళా సభ్యలకు కలిగే లాభాలను వివరించారు. రుణ బీమా సౌకర్యం ఈ సంవత్సరం మార్చి నుంచే అమలులోకి వచ్చిందన్నారు. సంఘాల్లోని సభ్యులు సహజంగా మరణిస్తే బ్యాంకు నుంచి పొందిన అప్పు నిల్వలో గరిష్టంగా రూ.2లక్షల వరకు బీమా వర్తిస్తుందన్నారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా అందనుందన్నారు. ప్రమాదం కారణంగా పాక్షిక వైకల్యం (50శాతం) సంభవిస్తే రూ.5 లక్షల వరకు బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. ఇందుకు మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, సంఘం తీర్మాన పత్రం, గ్రామ సంఘం తీర్మానం, సభ్యురాలి సంఘం అప్పు, పొదుపు ఖాతాల బ్యాంకు స్టేట్‌మెంట్ (బ్యాంకు అధికారి సంతకంతో), సభ్యురాలి పాస్ పోర్ట్ సైజు ఫొటో, ఎఫ్‌ఐఆర్ కాపీ అదనంగా జతపర్చాలని తెలిపారు. సమావేశంలో జోనల్ మేనేజర్ అనంత కిషోర్, డీపీఎంలు, ఆర్‌ఎం, ఏపీఎంలు, సీసీలు, సీ్త్రనిధి సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment