ఉచిత న్యాయ సేవలు అందిస్తాం
రామగిరి (నల్లగొండ): పేదలు, సీ్త్రలు, పిల్లలు, కార్మికులు ప్రకృతి బీభత్సంతో నష్టపోయిన వారికి న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందిస్తామని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి బండి దీప్తి అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార దినోత్సవం సందర్భంగా శనివారం ఎస్‌పీఆర్ పాఠశాలలో ఏర్పాటు చేసినన న్యాయ విజ్ఞాన శిబిరంలో ఆమె మాట్లాడారు. న్యాయ సలహాలకు 15100 టోల్ ప్రీ నంబర్‌ను సంప్రదించి సలహాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, నిమ్మల భీమార్జున్‌రెడ్డి, నన్నూరి రాంరెడ్డి, అంథోని పాల్గొన్నారు.
ధాన్యం ఎగుమతులు వేగంగా జరగాలి
నకిరేకల్: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లతోపాటు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యం మిల్లులకు వేగంగా ఎగుమతి చేయాలని డీఆర్‌డీఓ ఎర్రబెల్లి శేఖర్‌రెడ్డి సూచించారు. నకిరేకల్ మండలం చందంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. ధాన్యం కొనుగోళ్ల రికార్డులను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం నిల్వ ఉండకుండా ఏరోజుకారోజు మిల్లులకు తరలించాలన్నారు. రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకొని వస్తే కొనుగోలు వెంటనే జరుగుతాయన్నారు. ఆయన వెంట ఐకేపీ ఏపీఎం నరహరి, సీసీ పద్మ తదితరులు ఉన్నారు.
జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
మిర్యాలగూడ: డిసెంబర్ 2, 3, 4 తేదీల్లో మిర్యాలగూడలో నిర్వహించే సీపీఎం జిల్లా 21వ మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శనివారం మిర్యాలగూడలోని ఆ పార్టీ కార్యాలయంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ మహాసభలకు జిల్లాలోని 33 మండలాలు, 8 మున్సిపాలిటీల నుంచి ప్రతినిధులు హాజరవుతారని, డిసెంబర్ 2న మహా ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీశైలం సొరంగమార్గం, డిండి ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం సకాలంలో పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు. యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంతో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంతోపాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు డబ్బికార్ మల్లేష్, వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవినాయక్, బావండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, అయూబ్, కూన్‌రెడ్డి వెంకట్‌రెడ్డి, మాతంగి సోమయ్య, మహమ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.
నృసింహుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో శనివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ చేపట్టిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలంకారమూర్తులను హారతితో కొలిచి, నిజాభిషేకం నిర్వహించి తులసీ పత్రాలతో అర్చన చేపట్టారు. అనంతరం ప్రధానాలయ మహాముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన, లోక కల్యాణార్థమై నిత్యకల్యాణం చేపట్టారు. సాయంత్రం అలంకార జోడు సేవలను ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు.
Comments
Please login to add a commentAdd a comment