సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేయాలి
నల్లగొండ టూటౌన్: బీజేపీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆ పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రముఖ్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్‌రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సంస్థాగత జిల్లా స్థాయి కార్యశాల సమావేశానికి వారు హాజరై మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు బూత్‌ల వారీగా సభ్యత్వ నమోదు చేయించి రాష్ట్రంలోనే జిల్లాను ముందంజలో ఉంచాలన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తల కృషితో సభ్యత్వ నమోదులో జిల్లాను మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్‌గౌడ్, సీనియర్ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, మొగిలయ్య, బండారు ప్రసాద్, చెనగోని రాములు, కంచర్ల విద్యాసాగర్‌రెడ్డి, పోతెపాక లింగస్వామి, పాలకూరి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తల మధ్య వాగ్వాదం..
బీజేపీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కార్యాచరణ సమావేశంలో కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నాగార్జునసాగర్ నియోజక వర్గంలో పనిచేసే వారికి పదవులు ఇవ్వకుండా డబ్బులు తీసుకుంటూ పదవులు కట్టబెడుతున్నారని ఆ నియోజక వర్గానికి చెందిన ఓ నాయకుడు అనడంతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. సాగర్, నకిరేకల్ నియోజక వర్గాలకు చెందిన కార్యకర్తలు నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఇరువురు నాయకులు కొట్టుకునే వరకు వెళ్లడంతో పార్టీ ముఖ్య నాయకులు జోక్యం చేసుకుని ఇరువురికి సర్ది చెప్పడంతో గొడవ సర్దుమణిగింది.
ఫ పార్టీ సభ్యత్వ నమోదు రాష్ట్ర ప్రముఖ్ రామచందర్‌రావు
Comments
Please login to add a commentAdd a comment