కుటుంబ వివరాలు జాగ్రత్తగా సేకరించాలి
నల్లగొండ: సమగ్ర సర్వేలో భాగంగా కుటుంబాల వివరాలు జాగ్రత్తగా సేకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క సమగ్ర కుటుంబ సర్వేపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన అనంతరం మాట్లాడారు. సర్వే సందర్భంగా వచ్చే సమస్యలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. సర్వే వివరాలు సేకరించిన తర్వాత ఫారాలను జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. సర్వే సమయంలో ప్రజలకు సందేహాలు వస్తుంటాయని, వాటిని నివృత్తి చేసి సర్వేను కొనసాగించాలన్నారు. కుటుంబ సర్వేపై పట్టణ, గ్రామస్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. ఈ సమావేశానికి అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, హాజరయ్యారు.
ప్రజలంతా సర్వేకు సహకరించాలి
సమగ్ర కుటుంబ సర్వేకు ప్రజలు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ప్రారంభమైన సర్వేను ఆమె జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీ, హైదర్‌ఖాన్ గూడ కాలనీల్లో పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే ఫారంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా పూరించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. కుటుంబ యజమానులు సమగ్ర సర్వే ఫారంపై పూర్తి సంతకం చేయాల్సిన అవసరం లేదని, కేవలం పొడి సంతకం చేసినా సరిపోతుందన్నారు. ఆమె వెంట ఆర్డీఓ అశోక్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment