క్యాంపస్ సమాచారం
ఎంజీయూ డిగ్రీ పరీక్షలు వాయిదా
నల్లగొండ రూరల్: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ మూడవ, ఐదవ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఈఓ ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలను డిసెంబర్ 7వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఐదవ సెమిస్టర్ పరీక్షలను మధ్యాహ్నం సమయంలో నిర్వహించనున్నట్లు తెలిపారు
యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు
ఫ ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్
నల్లగొండ రూరల్: నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు ఉంటాయని ఎంజీయూ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయంలో ప్లేస్‌మెంట్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. యువతకు నైపుణ్యాలు, సామాజిక అంశాల సునిశిత పరిశీలన స్పృహ కలిగిన వారికి అనేక అవకాశాలు ఉంటాయన్నారు. ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఉద్యోగ మేళాకు 600 మంది అభ్యర్థులు హాజరు కాగా 250 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని ప్లేస్‌మెంట్ సెల్ డైరెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఉద్యోగ మేళాలో కాగ్నిజెంట్ టెక్ మహేంద్ర, విప్రో ఇన్ఫోసిస్, రేడియంట్, హేటేరో డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు పాల్గొన్నాయని తెలిపారు. కార్యక్రమంలో సందీప్, హిమబిందు, చందర్ పాల్గొన్నారు.
నాణ్యతతో కూడిన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని మహాత్మా గాంధీ యూనివర్సిటీ వీసీ అల్తాఫ్ హుస్సేన్ అన్నారు. బుధవారం ఎంజీయూలో హాస్టల్ కార్యదర్శులు, డైరెక్టర్, వార్డెన్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను యూనివర్సిటీలోనే ఉంటున్నందున హాస్టళ్లను స్వయంగా పర్యవేక్షిస్తానన్నారు. ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా విద్యార్థుల భాగస్వామ్యంతో నూతన విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. 75 శాతం హాజరు నిబంధనలు పాటించాలని విద్యార్థులకు తెలియజేయాలన్నారు. తరగతులకు వస్తేనే విజ్ఞానం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ అల్వాల రవి, హాస్టల్స్ డైరెక్టర్ దోమల రమేష్, వార్డెన్లు నీలకంఠం శేఖర్, ఆనంద్, ఆదిరెడ్డి, నవీన్, లోకేష్ పాల్గొన్నారు.
ఎన్జీ కాలేజీలో 25న పీజీ స్పాట్ కౌన్సెలింగ్
రామగిరి(నల్లగొండ): నల్లగొండ ఎన్జీ కళాశాలలో ఈ నెల 25న పీజీ స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ బుధవారం తెలిపారు. పీజీ సెట్ 2024 రాసిన వారు, రాయని వారు అందరూ అర్హులేనని పేర్కొన్నారు. డిగ్రీ 55 శాతం మార్కులు తప్పనిసరి తెలిపారు. అడ్మిషన్ పొందిన వారు ఎంఏ తెలుగు, ఎకనామిక్స్ రూ.25,400, ఎంకామ్ రూ.29,400, ఎంఎస్సీ జువాలజీ, కెమిస్ట్రీ రూ.34,700, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రూ.39,700 ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. కౌన్సిలింగ్‌కు హాజరయ్యే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు, రెండు సెట్ల జీరాక్స్ కాపీలు తీసుకురావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment