యువ కానిస్టేబుళ్లు వస్తున్నారు
ప్రజారక్షణ కోసమే
పోలీస్ ఉద్యోగంలో చేరా
ప్రజలకు రక్షణ కల్పించేందుకే పోలీసు ఉద్యోగంలో చేరా. పేదలకు సహాయం చేయడం, రక్షణ కల్పించడం పోలీసు శాఖ ద్వారానే సాధ్యం. మహిళల సంఖ్య అన్ని రంగాల్లో పెరుగుతుంది. మారుతున్న పరిస్థితుల కనుగుణంగా తన విధి నిర్వహణలో పేదలకు పోలీసు శాఖపై భరోసా కలిగేలా కృషి చేస్తా.
– మౌనిక, తెట్టెకుంట
చాలా సంతోషంగా ఉంది
పోలీసు ఉద్యోగంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. పేదలకు అన్యాయం జరిగితే మొదటగా పోలీసులను ఆఽశ్రయిస్తారు. ఎలాంటి అండ లేని వారికి పోలీసు శాఖ ద్వారానే న్యాయం జరుగుతుంది. అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజారక్షణకు కృషి చేస్తా.
– సతీష్, కేతేపల్లి
నల్లగొండ క్రైం: జిల్లాకు కొత్తగా 396 మంది యువ పోలీసులు రానున్నారు. జిల్లాకు కేటాయించిన కానిస్టేబుల్ అభ్యర్థులకు మేడ్చల్ శిక్షణ కేంద్రంలో ట్రైనింగ్ ముగిసింది. తొమ్మిది నెలల పాటు శిక్షణ పొందిన యువ కానిస్టేబుళ్లకు గురువారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. అనంతరం ఉత్తర్వులు తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లలో విధుల్లో చేరనున్నారు. కొత్త ఆశయాలు, ఆకాంక్షలతోపాటు ప్రజలకు రక్షణ కల్పించే ధ్యేయంతో విధుల్లో చేరుతున్న నూతన కానిస్టేబుళ్లలో ఉత్సాహం నెలకొంది.
తొమ్మిది నెలలపాటు శిక్షణ
తొమ్మిది నెలల శిక్షణ కాలంలో కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రజలకు రక్షణ కల్పించే విషయంతో పాటు సైబర్ నేరాల బారిన పడకుండా సంఘ విద్రోహ శక్తులను అణిచివేసే క్రమంలో తీసుకోవాల్సిన మెళకువలు నేర్పించారు. నల్లగొండ జిల్లాకు 396 మంది రానుండగా.. సివిల్ కానిస్టేబుళ్లు 291 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 192 మంది, మహిళలు 99 మంది మొత్తం 291 మంది ఉన్నారు. అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుళ్లు 105 మంది ఉండగా.. పురుషులు 86 మంది, మహిళలు 19 మంది ఉన్నారు. ఇప్పటికే జిల్లాలో 452 మంది విధులు నిర్వహిస్తుండగా 44 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారు.
ఫ నేడు శిక్షణా కానిస్టేబుళ్లకు
పాసింగ్ అవుట్ పరేడ్
ఫ జిల్లాకు రానున్న
291 మంది సివిల్ కానిస్టేబుళ్లు,
105 మంది ఏఆర్ కానిస్టేబుళ్లు
ఫ పెరుగనున్న మహిళా పోలీసుల సంఖ్య
Comments
Please login to add a commentAdd a comment