రైతు సమస్యలు.. పరిష్కార మార్గాలపై అవగాహన
గరిడేపల్లి: గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా మల్లారెడ్డి యూనివర్సిటీకి చెందిన వ్యవసాయ డిగ్రీ కళాశాల విద్యార్థినులు బుధవారం గరిడేపల్లిలోని తహసీల్దార్ కార్యాలయంలో గ్రామీణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను గ్రామ పటం, చిత్రాల రూపంలో వివరించారు. రైతులు ఎక్కువగా ఒకే పంట పండిస్తున్నారని, దాని ద్వారా భూసారం తగ్గుతుందని తెలిపారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్త కిరణ్, తహసీల్దార్ కవిత, ఎంపీడీఓ సరోజ, ఏఓ ప్రియతమ్, శాస్త్రవేత్త డి.ఆదర్శ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment