వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
కొండమల్లేపల్లి: వైన్ షాపుల్లో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి, అతడి నుంచి రూ.1.85లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్య బుధవారం తన కార్యాలయంలో వెల్లడించారు. గుర్రంపోడు మండల కేంద్రంలో గత నెల 12న ఆదిత్య వైన్ షాపులో రూ.10లక్షల నగదు అపహరణకు గురైంది. వైన్స్ యజమాని నరసింహరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుర్రంపోడు పోలీసులు కేసు నమోదు చేశారు. నల్లగొండ సీసీఎస్ పోలీసులు, కొండమల్లేపల్లి సీఐ దర్యాప్తు దర్యాప్తు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు కొండమల్లేపల్లి సీఐ ధనుంజయ్య, గుర్రంపోడు ఎస్‌ఐ మధు, కానిస్టేబుల్ సత్యనారాయణ, కిరణ్ బాబు, దశరథలు నిందితుడైన బిస్తు రమేష్‌ను ఈనెల 20న కొండమల్లేపల్లి బస్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని విచారించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 వైన్ షాపుల్లో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. బిస్తు రమేష్ నుంచి రూ.1.85లక్షలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. కేసును చేధించడంలో భాగస్వాములైన నల్లగొండ జిల్లా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ సోమ నరసయ్య, సిబ్బంది, కొండమల్లేపల్లి సీఐ, గుర్రంపోడు పోలీసులను ఎస్పీ అభినందించి రివార్డు అందజేశారు.
ఫ రూ.లక్షా 85వేలు స్వాధీనం
చేసుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment