ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలి
నల్లగొండ: రైస్ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో 2023–24 వానాకాలం, యాసంగి సీఎంఆర్ పెండింగ్, ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నెలాఖరులోపు పెండింగ్ సీఎంఆర్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్లు రోజూ మిల్లులను సందర్శించి మిల్లర్లు త్వరగా సీఎంఆర్ చెల్లించే విధంగా చూడాలన్నారు. మిల్లర్లు.. ధాన్యం కొన్న రైతుల వివరాలను ఫారం–బీ రిజిస్టర్‌లో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొన్నదైతే రిజిస్టర్–ఏ2లో నమోదు చేయాలన్నారు. ఈ వానాకాలానికి సంబంధించిన ధాన్యాన్ని వెంటనే అన్‌లోడ్ చేసుకోవాలని, సన్న, దొడ్డు ధాన్యాలను వేరువేరుగా నిలువ చేయాలన్నారు. సమావేశంలో డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ హరీష్, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు నారాయణ, మిర్యాలగూడ సెక్రటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ అదనపు కలెక్టర్ శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment