జిల్లాకు 56 మంది గ్రూప్–4 ఉద్యోగులు
నల్లగొండ: గ్రూప్–4 పరీక్ష ద్వారా జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికై న అభ్యర్థులన పూర్తయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 డిసెంబర్‌లో గ్రూప్–4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జులై 1న రాత పరీక్ష నిర్వహించారు. 2024 ఫిబ్రవరిన ర్యాంకుల జాబితాను ప్రకటించిన ప్రభుత్వం వారం రోజుల క్రితం ఎంపికై న వారి జాబితాను విడుదల చేసింది. అయితే జిల్లాకు 56 మందిని కేటాయించింది. వారంతా రెవెన్యూ శాఖకే అలాట్ చేయడంతో వారు బుధవారం నల్లగొండ కలెక్టరేట్‌లో సర్టిఫికెట్ల వెరిపికేషన్‌కు హాజరయ్యారు. కాగా అభ్యర్థుల సర్టిఫికెట్లను డీఆర్‌ఓ అమరేందర్, కలెక్టరేట్ ఏఓ మోతీలాల్, సిబ్బంది ఆధ్వర్యంలో పరిశీలించారు.
నేడో, రేపో పోస్టింగ్ ఉత్తర్వులు
గ్రూప్–4 ద్వారా ఎంపికై జూనియర్ అసిస్టెంట్లుగా నియమితులైన వారికి ఒకటి, రెండు రోజుల్లో పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోస్టింగ్‌లు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే నల్లగొండ జిల్లాలో 33 మండలాలున్నాయి. 56 మంది జూనియర్ అసిస్టెంట్లను అలాట్ చేశారు. ప్రస్తుతం జూనియర్ అసిస్టెంట్లు రెవెన్యూశాఖకు వస్తుండడంతో ఆ శాఖలో ఉద్యోగుల సంఖ్య పెరగనుంది. దీంతో ఉన్న ఉద్యోగులపై పని భారం తగ్గడంతో పాటు రెవెన్యూలో పనులు వేగంగా జరిగే అవకాశం ఉంది.
ఫ జూనియర్ అసిస్టెంట్లుగా ఎంపికై న వారిని కేటాయించిన ప్రభుత్వం
ఫ కలెక్టరేట్‌లో సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి
ఫ వారందరికీ రెవెన్యూ శాఖలో పోస్టింగ్
Comments
Please login to add a commentAdd a comment