22న ప్రజా పాలన విజయోత్సవాలు
నల్లగొండ: నల్లగొండలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఈ నెల 22న ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా తలపెట్టిన జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాట్లపై బుధవారం నల్లగొండలోని తన చాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఈ నెల 23న తలపెట్టిన కార్యక్రమాలను అనివార్య కారణాల వల్ల ముందస్తుగానే నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు రానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఆర్‌ఓ అమరేందర్, ఆర్డీఓ అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సర్వే వివరాలు గోప్యంగా ఉంచాలి
సమగ్ర ఇంటింటి సర్వేలో సేకరించిన కుటుంబాల వివరాలను గోప్యంగా ఉంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణలో ఆమె మాట్లాడారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సర్వే వివరాలను బయటకు వెల్లడిస్తే సీఆర్‌పీసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఓ వెంకటేశ్వర్లు, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment