రైతులకు నాణ్యమైన విత్తనాలు అమ్మాలి
మిర్యాలగూడ: రైతులకు ఎరువుల డీలర్లు, ఫర్టిలైజర్ దుకాణాదారులు నాణ్యమైన విత్తనాలు, ఎరువులను అమ్మాలని డీఏఓ శ్రవణ్‌కుమార్ అన్నారు. బుధవారం మిర్యాలగూడలోని రైతువేదికలో విత్తన డీలర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎరువులు, విత్తనాలను కొనుగోలు చేసిన రైతులకు తప్పకుండా రశీదు ఇచ్చి రశీదుపై రైతుల సంతకాలు తీసుకోవాలన్నారు. రైతులు రశీదులను పంట పండించేంతవరకు భద్రపరుచుకోవాలని, విత్తనాలు, రైతులు నాసిరకమైతే సంబంధిత వ్యాపారిపై చర్యలు తీసుకునేందుకు వీలుంటుందన్నారు. జిల్లాలో వచ్చే యాసంగి సీజన్‌లో 5.25లక్షల ఎకరాల్లో వరిసాగు జరుగుతుందని అంచనా ఉందన్నారు. జిల్లాలో 26,700 మెట్రిక్ టన్నుల యూరియా, 1700 మెట్రిక్ టన్నుల డీఏపీ, 2300 మెట్రిక్ టన్నుల పొటాష్, 1400 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్, 1700 మెట్రిక్ టన్నుల సూపర్ ఎరువులు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని పేర్కొన్నారు. రైతులు లైసెన్స్ కలిగిన దుకాణాదారుల వద్దనే ఎరువులను, విత్తనాలను కొనుగోలు చేయాలన్నారు. రైతులు వరికొయ్యలను తగలబెట్టడం వల్ల నేలలో పోషకాలు తగ్గుతాయన్నారు. సమావేశంలో ఏడీఏ దేవ్‌సిం, ఏఓలు సైదానాయక్, రుషేంద్రమణి, సరిత, శివరాంకుమార్, ఉమారాణి ఉన్నారు.
ఫ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment