రేవంత్‌రెడ్డిది విధ్వంస పాలన
నల్లగొండ టూటౌన్: సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన పేరుతో విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అలవి కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన రేవంత్‌రెడ్డిని రాజకీయంగా బొండ పెట్టేందుకు తెలంగాణ సమాజం ఎదురు చూస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో సమైక్యాంధ్ర కోసం పోరాడిన రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోదీని విమర్శించే స్థాయి సీఎంకు లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు గోలి మధుసూదన్‌రెడ్డి, మాదగాని శ్రీనివాస్‌గౌడ్, పోతెపాక సాంబయ్య, మిర్యాల వెంకటేశం, రావెళ్ల కాశమ్మ, వంగూరి రాఖీ తదితరులు పాల్గొన్నారు.
ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్
నాగం వర్షిత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment