విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
కనగల్: ప్రకృతిలో లభించే ఇంధన వనరులను వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు వృథా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ మర్రు పాండురంగారావు అన్నారు. ఇంధన వనరుల పొదుపు వారోత్సవాల్లో భాగంగా మంగళవారం కనగల్ మండలం చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో పెట్రోలియం, బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలు దొరకని పరిస్థితి ఉంటుందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఇళ్లు, పాఠశాలలపై సోలార్ ఎనర్జీ ప్లాంట్లనుఏర్పాటు చేసుకొని విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా సోలార్ ఎనర్జీ అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం గీద రమేష్‌రెడ్డి, రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, హిందూ రాణి, సరిత, మధుసూదన్, శశిరేఖ, నరేందర్‌రెడ్డి, ఉమామహేశ్వరి, వాసు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment