వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలి
నల్లగొండ : చలి తీవ్రత పెరిగింది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆహార విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.. న్యూట్రిషియనిస్ట్
డాక్టర్ కళ్యాణి.
● ఈ కాలంలో వేడిగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ప్రిడ్జ్‌లోని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవద్దు. బేకరి ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.
● చలి కాలమని పండ్లు తినడం మానేస్తారు. అది సరైంది కాదు. పండ్లు తినాలి. వాటితో పాటు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగుతోపాటు గుడ్డు తీసుకుంటే మంచిది.
● రోజువారీ డైట్‌లో రోగనిరోధక శక్తి పెంచే ఆహార పదార్థాలను చేర్చాలి. క్యాబేజీ, నిమ్మజాతి పండ్లు, చిలగడదుంపతో పాటు తృణధాన్యాలు తీసుకోవాలి. రోజూ ఉదయాన్నే వేడివేడిగా ఓ కప్పు గ్రీన్‌టీ లేదా అల్లంటీ తాగాలి.
● ముఖ్యంగా తాజా కూరగాయలు, మొలకెత్తిన గింజలు, బీన్స్, మాంసం వంటి పదార్థాలతో తయారు చేసిన సూప్స్ వేడివేడిగా తీసుకోవాలి. తద్వారా ఇన్ఫెక్షన్లు సోకకుండా ఉండడంతో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఫ న్యూట్రిషియనిస్ట్ డాక్టర్ కళ్యాణి సూచన
Comments
Please login to add a commentAdd a comment