బహిరంగ సభను విజయవంతం చేయాలి
నల్లగొండ రూరల్: జిల్లా కేంద్రంలోని ఎన్‌జీ కళాశాల మైదానంలో ఈ నెల 30న జరగనున్న సీపీఐ బహిరంగ సభను విజయవంతం చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి కోరారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మగ్దూమ్ భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని ధ్వంసం చేయడం కోసమే ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిందన్నారు. సీపీఐ జమిలి ఎన్నిక బిల్లును వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అనంతరం పార్టీ 100 సంవత్సరాల బహిరంగ సభ కరపత్రాన్ని విడుదల చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఈ నెల 30న జరిగే సీపీఐ బహిరంగ సభకు పార్టీ శ్రేణులతోపాటు కమ్యూనిస్టు అభిమానులు నూతన ఉత్తేజంతో తరలిరావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహారెడ్డి, మల్లేపల్లి ఆదిరెడ్డి, ఉజ్జిని రత్నాకర్‌రావు, లోడంగి శ్రవణ్‌కుమార్, పబ్బు వీరస్వామి, ఆర్.అంజచారి, బంటు వెంకటేశ్వర్లు, బొల్గురి నర్సింహ, తీర్పారి వెంకటేశ్వర్లు, గాదెపాక రమేష్, కె ఎస్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment