నత్తనడకన ‘ఇందిరమ్మ’ సర్వే
చింతపల్లి ఎంపీడీఓకు
షోకాజ్ నోటీసు
చింతపల్లి : ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనలో నిర్లక్ష్యం వహించడం, కిందిస్థాయి సిబ్బందికి యాప్ వివరాల నమోదుపై అవగాహన కల్పించకపోవడంతో చింతపల్లి ఎంపీడీఓ సుజాతకు షోకాజ్ నోటీస్ జారీ చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. బుధవారం ఆమె చింతపల్లి మండలం ఘాసిరాంతండా, నసర్లపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వే కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఘాసిరాంతండాలో సర్వే బృందం యాప్‌లో నమోదు చేసిన వివరాలను పరిశీలించారు. రమావత్ శంకర్, కొర్ర సరిత వివరాలను సరిగా అప్‌లోడ్ చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తుల పరిశీలనకు సర్వే బృందాలు వచ్చినప్పుడు దరఖాస్తుదారులు ఇంటి వద్ద ఉండాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ 18004251442 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలన్నారు. కలెక్టర్ వెంట దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్ల సర్వే జిల్లాలో నత్తనడకన సాగుతోంది. సర్వర్ సక్రమంగా పని చేయకపోవడం వల్ల సర్వే కోసం వెళ్లిన సిబ్బంది ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్‌కాక గంటల తరబడి ఎదురు చూస్తున్నారు. రోజుకు 50 ఇళ్లను సర్వే చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో అది సాధ్యం కాక సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
4,31,831 మంది దరఖాస్తు..
ఇందిరమ్మ ఇళ్ల కోసం జిల్లాలో ప్రజాపాలన కార్యక్రమంలో 4,31,831 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో అర్హులను గుర్తిచేందుకు ప్రభువ్వం ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లాలో ఇందిరమ్మ సర్వేను ప్రారంభించింది. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో వార్డు ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో సర్వే సాగుతోంది. ప్రతి ఒక్కరూ రోజూ 50 మంది దరాఖాస్తుదారుల ఇళ్లను సర్వే చేయాలని ఆదేశించింది. దరఖాస్తుదారుల వివరాలను ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్ చేశారు. వాటి ఆధారంగా సర్వే చేస్తున్నారు. అయితే సర్వేకు వెళ్లిన సందర్భంలో సర్వర్ పనిచేయక పోవడంతో రోజూ ఐదు ఇళ్లను కూడా సర్వే చేయలేకపోతున్నారు. దీంతో ఇప్పటి వరకు 67 వేల ఇళ్లను మాత్రమే సర్వే చేశారు.
సర్వేకు ఎక్కువ సమయం
దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లిన సమయంలో.. ఉండే ఇల్లు ఒక చోట ఉంటే కొంతమంది ప్లాటు వేరే చోట ఉంటున్నాయి. దరఖాస్తుదారుడి ఫొటో, డాక్యుమెంట్‌తో పాటు ప్లాట్ ఫొటో కూడా తీసుకోవాల్సి ఉండడంతో సమయం ఎక్కువ పడుతోంది. మొన్నటి వరకు ఇంటి డాక్యుమెంట్ లేదా ఇంటి పన్ను రసీదును కూడా పీడీఎఫ్ చేసి ఆన్‌లైన్‌లో పెట్టాలని నిబంధన ఉన్నా.. ప్రస్తుతం అది అసవరం లేదని ఫొటో మాత్రమే తీయాలని పేర్కొన్నారు. సర్వర్ సతాయింపు, గ్రామాల్లో నెట్ సక్రమంగా అందకపోవడంతో కొంత సమస్యగా మారింది. ప్రతి రోజు 10 నుంచి 20 ఇళ్ల వరకు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వరకు సర్వర్ పని చేయలేదు. దీంతో సిబ్బంది ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఫ రోజుకు 50 మంది దరఖాస్తుదారుల ఇళ్లను సర్వే చేయాలని ఆదేశాలు
ఫ కానీ 10 నుంచి 20 ఇళ్లు కూడా
చేయలేకపోతున్న సిబ్బంది
ఫ సర్వర్ సమస్యతో ముందుకుసాగని సర్వే
Comments
Please login to add a commentAdd a comment