హోరాహోరీగా సీఎం కప్ క్రీడాపోటీలు
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ పట్టణంలోని మేకల అభినవ్ ఔట్‌డోర్ స్టేడియంలో జరుగుతున్న సీఎం కప్ –2024 జిల్లాస్థాయి క్రీడాపోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. బుధవారం మూడవ రోజు ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలను పరిశ్రమల శాఖ జీఎం కోటేశ్వర్‌రావు, డీఈఓ భిక్షపతి, కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ ఎంవీ.గోనారెడ్డి ప్రారంభించారు. అంతకు ముందు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఫుట్‌బాల్, వాలీబాల్ పోటీలు నువ్వా.. నేనా అన్న రీతిలో సాగాయి. గెలుపొందిన జట్లకు నిర్వాహకులకు బహమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి కుంభం నర్సిరెడ్డి, ఎస్‌జీఎఫ్ (అండర్–19) కార్యదర్శి ఇందిర, విమల, కిరణ్, నజీర్, సురేష్, బొమ్మపాల గిరిబాబు, ఇమామ్ కరీం, కవిత, నాగరాజు, బాలు, యుగంధర్, నారాయణరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment