మాతా శిశు మరణాలు సంభవించొద్దు
నల్లగొండ : మాత శిశు మరణాలు లేని జిల్లాగా నల్లగొండను తీర్చిదిద్దేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. మహిళ గర్భం దాల్చిననాటి నుంచి ప్రసవం అయ్యే వరకు, ప్రసవానంతరం కూడా వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్ పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రతినెలా వైద్య పరీక్షలు, ఇమ్యునైజెషన్, పౌష్టికాహారం అందించాలని సూచించారు. వైద్యుల అనుమతి లేకుండా మెడికల్ షాపులు, ఆస్పత్రుల్లో అబార్షన్ కిట్లు అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరమన్నారు. మాత శిశు సంరక్షణపై మూడు డివిజన్లలో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్‌ఓ డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వేణుగోపాల్‌రెడ్డి, కృష్ణవేణి, అరుణకుమారి వైద్యులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment