డబుల్ బెడ్‌రూం ఇళ్లు అందించాలి
నల్లగొండ రూరల్: లాటరీ ద్వారా ఎంపికై న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సీపీఎం నల్లగొండ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తహసీల్దార్ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించి వెంటనే ఇళ్లను స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సాధన పోరాట కమిటీ కన్వీనర్‌గా మాజీ కౌన్సిలర్ అవుట రవీందర్‌తోపాటు 19మందితో కమిటీని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కార్యక్రమంలో సీపీఎం పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, సయ్యద్ హశం, ఎండీ సలీం, తుమ్మల పద్మ, అద్దంకి నరసింహ, దండంపల్లి సరోజ, కోట్ల అశోక్ రెడ్డి, గుండాల నరేష్, ఊటుకూరు మధుసూదన్‌రెడ్డి, భూతం అరుణ, గంజి నాగరాజు, మారగోని నగేష్, అవుట రవీందర్, లబ్ధిదారులు లతీఫ్, సుజాత శ్రీనివాస్ జహంగీర్, గణేశ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment