తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించాలి
నల్లగొండ: ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, ఆర్డీఓలు, తహసీల్దార్లతో ప్రత్యేక ఓటరు జాబితాపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఓటరు జాబితాపై నిర్వహించే సమావేశాలను వెబ్‌సైట్‌లో ఉంచాలని తెలిపారు. మార్పులు, చేర్పులు, తొలగింపులపై దృష్టి పెట్టాలన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జనవరి 6న తుది ఓటరు జాబితా ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓటరు జాబితాపై వచ్చిన అభ్యంతరాలు, పరిష్కార అంశాలపై సమీక్షించారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ.. ఓటరు జాబితా సవరణ, తుది జాబితా రూపకల్పనలో భాగంగా పోలింగ్ కేంద్రాల వారీగా తనిఖీ చేస్తున్నామన్నారు. ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 7,40,971 మంది పురుష ఓటర్లు, 7,61,105 మంది మహిళా ఓటర్లు, 127 మంది ట్రాన్స్‌జెండర్లు, మొత్తం 15,2,203 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. అంతకు ముందు కలెక్టర్ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ కమిషనర్ బాలమాయాదేవికి పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డీఆర్‌ఓ అమరేందర్, ఆర్డీఓలు రమణారెడ్డి, అశోక్ రెడ్డి, వెంకటేశ్వర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
మెనూ తప్పకుండా అమలుచేయాలి
అన్ని బీసీ సంక్షేమ హాస్టళ్లలో మెనూను తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి అన్నారు. సోమవారం నల్లగొండలోని బీసీ బాలికల కళాశాల వసతి గృహాన్ని ఆమె సందర్శించి వంట గదులు, డైనింగ్‌హాల్, స్టోర్ రూం, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు కెరీర్ గైడెన్స్‌పై కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించారు. మెడికల్ చెకప్ గురించి ఆరా తీశారు. ఆమె వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాజా నజీమ్ అలీ, తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు.
ఫ ఓటరు జాబితా పరిశీలకురాలు బాలమాయాదేవి
Comments
Please login to add a commentAdd a comment