పెండింగ్ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు
నల్లగొండ: పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. మొత్తం 83 మంది వినతిపత్రాలు సమర్పించారని, వ్యక్తిగత అంశాలు, పింఛన్లు, భూమికి సంబంధించిన అంశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. జిల్లాలో మాతా, శిశు మరణాలు సంభవించకుండా చూడాలని, గర్భిణులకు క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. నవజాత శిశు కేసులను ప్రభుత్వ ఆస్పత్రి నుంచి నిలోఫర్‌కి పంపించే సమయంలో ఆలస్యం కాకుండా చూడాలన్నారు. ప్రభుత్వం ఇటీవల జిల్లాకు 108 అంబులెన్స్‌లు మంజూరు చేసిందని, వాటిని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లలో కవల పిల్లల ప్రసవాలు నిర్వహించొద్దని, ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులకు పంపించాలని వైద్యాధికారులకు సూచించారు. సమావేశంలో డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డీసీహెచ్ డాక్టర్ మాతృ నాయక్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, డీఆర్‌ఓ అమరేందర్, డీఆర్‌డీఓ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment