కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ
నల్లగొండ: బీఆర్ అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు నల్లగొండలోని డీఈఓ ఆఫీస్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆయన నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతోందన్నారు. అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించకపోవడం బాధాకరమన్నారు. అమిత్ షాను ఇప్పటికై నా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్లగొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తుల కోటి, ఎండీ ముంతాజ్, దుబ్బ అశోక్ సుందర్, జూలకంటి శ్రీనివాస్, కిన్నెర అంజి, సురిగి వెంకన్న, జూలకంటి సైదిరెడ్డి, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బోడస్వామి, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు వజ్జ రమేష్ యాదవ్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి, మామిడి కార్తీక్, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక అంజయ్య, పెరిక మహేష్, వడ్డేపల్లి కాశీరాం, చింత గోపాల్, పాదం అనిల్, దాసరి శంకర్, పరశురాం, ప్రసాద్, విజయ్ పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్
Comments
Please login to add a commentAdd a comment