కొత్త సంవత్సరంలోకి కోలాహలంగా..
రామగిరి(నల్లగొండ): నూతన సంవత్సరం 2025 స్వాగత వేడుకలను జిల్లా ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. 2024 సంవత్సరానికి గుడ్ బై చెప్పి.. కొత్త సంవత్సరానికి కేరింతల నడుమ యువత స్వాగతం పలికారు. పెద్దలు, యువత అర్ధరాత్రి వరకు విందు వినోదాలతో వేడుకలు జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మహిళలు ఇళ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేశారు. రాత్రి 12 గంటల తర్వాత కేక్ కట్ చేసి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ కొత్త ఆశలతో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. చర్చిల్లో క్రైస్తవులు అర్ధరాత్రి ప్రత్యేక ప్రార్థనలు, కేక్ కట్ చేసి నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికారు.
బేకరీలు, స్వీట్ షాపుల వద్ద సందడి..
నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా బేకరీల వద్ద కేక్ కొనుగోలు చేసేందుకు వచ్చేవారితో సందడి వాతావరణం నెలకొంది. బేకరీల నిర్వాహకులు కేక్‌లపై ఆఫర్లు ప్రకటించారు. విక్రయదారులను ఆకర్షించేలా పలు రకాల కేక్‌లను తయారు చేశారు. కేక్‌లతో పాటు కూల్ డ్రింక్స్, స్వీట్ల కొనుగోళ్లు కూడా విపరీతంగా జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment