నేడు నల్లగొండకు మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ : నల్లగొండకు ఆదివారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. ఉదయం 11 గంటలకు నల్లగొండలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ప్రాంగణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని పరిశీలిస్తారు. 11.30 గంటలకు జిల్లా అభివృద్ధిపై కలెక్టరేట్‌లో నిర్వహించే సమీక్షలో పాల్గొంటారు. మధ్యాహ్నం రెండు గంటలకు నల్లగొండలోని వివిధ కార్యక్రమాల్లో పాల్గొని.. 3 గంటలకు హైదరాబాద్ బయలుదేరి వెళ్తారు.
విధుల్లో చేరిన డీపీఓ వెంకయ్య
నల్లగొండ : జిల్లా
పంచాయతీ అధికారి కొండా వెంకయ్య నల్ల గొండలోని డీపీఓ కార్యాలయంలో శనివారం విధుల్లో చేరారు. మల్కాజిగిరి జిల్లా నుంచి ఇటీవల బదిలీ అయిన ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు.
అంధుల కోసం
గ్రంథాలయం
● కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ : నల్లగొండలో అంధుల కోసం ప్రత్యేక గ్రంథాలయం ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతిలో ఆమె మాట్లాడారు. గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడానికి బ్రెయిలీ బుక్ తయారు చేయించాలని అధికారులకు సూచించారు. అంధులకు ఇందిరమ్మ ఇళ్లలో ఐదు శాతం రిజర్వేషన్ కచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు. అంధుల సమక్షంలో బ్రెయిలీ జయంతి నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి, హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, ఉపాధి కల్పన అధికారి పద్మ, సీడీపీఓ హరిత, సునీత, నాగిరెడ్డి, వెంకట్‌రెడ్డి, సైదులు, ప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment