పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్‌పో ్లజివ్స్ కంపెనీలో పేలుడు సంభవించడంతో గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు.
- 8లో
మాసోత్సవాలను
విజయవంతం చేస్తాం
నల్లగొండ : రోడ్డు భద్రత మాసోత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రణాళికను రూపొందించామని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్ హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, రవాణాశాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో జాతీయ రహదారులపై 57 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని.. అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎస్పీ శరత్‌చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ కృషితో 17 బ్లాక్ స్పాట్స్ తగ్గాయని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, జిల్లా రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, ఆర్టీఓ లావణ్య పాల్గొన్నారు.
కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment