వినూత్న ఆలోచనలు పెంపొందించాలి
ఫ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
ఫ ముగిసిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన
ఫ రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులకు బహుమతులు అందజేత
నల్లగొండ : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసి వారిలో వినూత్న ఆలోచనలను పెంపొందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండలోని డాన్ బోస్కో పాఠశాలలో రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా వైజ్ఞానిక, సైన్స్, గణిత, పర్యావరణ ప్రదర్శన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులకు బహుమతులు అందజేసి మాట్లాడారు. సైన్స్ ఆధారంగానే జీవన విధానం మారుతుందని, ఆధునిక వ్యవసాయ రంగంలో సైన్స్ ది కీలకపాత్ర అన్నారు. శాస్త్రవేత్తలు వివిధ రకాల యంత్రాలు కనుగొనడం వల్ల వ్యవసాయం ప్రస్తుతం చాలా సులభమైందన్నారు. సైన్స్, గణితం, పర్యావరణం, కమ్యూనికేషన్ తదితర అంశాలు మనిషి చుట్టూ ముడిపడి ఉన్నాయన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 236 ప్రాజెక్టుల ప్రదర్శించడం అభినందనీయమన్నారు. అనంతరం జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, డీఈఓ బి.భిక్షపతి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్‌రెడ్డి, లక్ష్మయ్య, డాన్ బోస్కో స్కూల్ ప్రిన్సిపాల్ బాలశౌరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment