యూనిక్‌గా ఉండాలన్న పట్టుదలతో..
సూర్యాపేట: డ్రిల్‌మ్యాన్‌గా పేరొందిన పనికెర క్రాంతికుమార్‌ది యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు. తండ్రి పనికెర సత్తయ్య తాపీమేసీ్త్ర. తల్లి వ్యవసాయ కూలీ. 1నుంచి 5వ తేదీ వరకు అడ్డగూడురులో, 6 నుంచి 10వ తరగతి వరకు శాలిగౌరారం జెడ్పీహెచ్‌ఎస్‌లో చదివాడు. సూర్యాపేట మణికంఠ జూనియర్ కళాశాలలో ఇంటర్ హెచ్‌ఈసీలో చేరాడు. ఇంటి నుంచి పంపే డబ్బుల కోసం చూడకుండా మిర్చి బండీ వద్ద పనిచేసేవాడే. ఈ క్రమంలోనే వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయడం సాధన చేసేవాడు. డిగ్రీ పూర్తయ్యాక తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీలో ఎంఎస్‌సీ యోగా చేశాడు. కొంతకాలంగా సూర్యాపేటలోనే నివాసం ఉంటున్నాడు.
క్రాంతికుమార్ నాలుగు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించడం వెనుక అలుపెరగని సాధన, శ్రమ దాగి ఉంది. ఎవరికీ సాధ్యంకాని పనులు చేయాలన్న భావనతో ఇంటర్ నుంచే చిన్నచిన్న ప్రదర్శనలు సాధన చేస్తుండేవాడు. ప్రధానంగా వేడివేడి నూనెలోంచి బజ్జీలను తీయడం, ముక్కులో మొలలు (సీలలు) కొట్టుకోవడం వంటివి సాధన చేస్తుండేవాడు. వీటిని కాలేజీలో, ఇతర చోట్ల ప్రదర్శించడం ప్రారంభించాడు. ఈ ప్రదర్శనలను చూసి క్రాంతికుమార్‌ను పేరిణి నృత్య కళాకారుడు వెంకట్ వెన్నంటి ప్రోత్సహించాడు.
దేశ, విదేశాల్లో ప్రదర్శనలు
ముక్కులో నాలుగు ఇంచుల డ్రిల్ (గోడలను రంధ్రాలు చేసే మిషన్) వేసుకోవడం, మేకులను కొట్టుకోవడం వంటి ప్రదర్శనలు చేశాడు. ప్రధానంగా 2011లో ఇండియాస్ గాట్ టాలెంట్ షోలో కాంత్రి ప్రదర్శించిన విన్యాసాలతో వెలుగులోకి వచ్చాడు. వివిధ తెలుగు ఛానళ్లలోనూ విన్యాసాలు ప్రదర్శించి డ్రిల్ మ్యాన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అమెరికా, మలేషియా, సింగపూర్, స్పెయిన్, ఇటలీలోనూ విన్యాసాలు ప్రదర్శించి రికార్డులు సృష్టించాడు. క్రాంతికుమార్‌ను భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ ఎంతగానో ప్రోత్సహించాడు. మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆర్థికంగా చేయూతనిచ్చారు.
గిన్నిస్ రికార్డుల్లో చోటిలా..
2024 ఫిబ్రవరిలో ఇటలీలోని మిలాన్ నగరంలో గిన్నిస్ వరల్డ్ రికార్డు నిర్వాహకుల ఎదుట నాలుగు ప్రదర్శనలు చేసి అన్నింటా సత్తా చాటాడు. ఒకేసారి నాలుగు రికార్డులు సాధించాడు.
● మొదటిది 60 సెకన్లలో 57 టేబుల్ ఫ్యాన్లను నాలుకతో ఆపి ఔరా అనిపించాడు.
● రెండవది కత్తులను గొంతులో పెట్టుకుని తాడు సాయంతో 1,944 కిలోల బరువున్న వాహనాన్ని ఐదు మీటర్ల మేర లాగి రెండో రికార్డు,
● 60 సెకన్లలో 22 సార్లు నాలుగు అంగుళాల మేకులను ముక్కులో కొట్టుకోవడం మూడో రికార్డు
● నాలుగు రికార్డ్ 300 డిగ్రీల వేడి నూనెలో 60 సెకన్లలో 17 చికెన్ ముక్కలను బయటకు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment