బోరు మోటార్ల వైర్లు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్ట్
నార్కట్‌పల్లి: వ్యవసాయ పొలాల వద్ద బోరు మోటార్ల వైర్లు చోరీ చేస్తున్న వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు నార్కట్‌పల్లి ఏఎస్‌ఐలు నర్సిరెడ్డి, ఆంజనేయులు తెలిపారు. నూతనకల్ మండలం గోరెంట్లతండాకు చెందిన లావుడ్య తిరుమలేష్ చెడు వ్యవసనాలకు అలవాటుపడి హయత్‌నగర్‌కు చెందిన తన స్నేహితులు సైదా, శ్రీనుతో కలిసి వ్యవసాయ బావుల బోరు మోటార్ల వైర్లను చోరీ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 1వ తేదీన నార్కట్‌పల్లి నుంచి ఏనుగులదోరి గ్రామానికి వెళ్లే దారిలో సామ కొండల్‌రెడ్డి వ్యవసాయ భూమి వద్ద బోరు మోటారు వైరు చోరీ చేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం నార్కట్‌పల్లి బస్టాండ్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన తిరుమలేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు నిజం ఒప్పుకున్నాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనట్లు ఏఎస్‌ఐలు పేర్కొన్నారు. డీఎస్పీ శివరాంరెడ్డి పర్యవేక్షణలో సీఐ నాగరాజు, ఎస్‌ఐ క్రాంతికుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment