మంత్రులను కలిసిన పెద్దగట్టు ఆలయ కమిటీ
చివ్వెంల(సూర్యాపేట) : తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సోమవారం రాత్రి హైదరాబాద్‌లోని సచివాలయంలో శ్రీ లింగమంతులస్వామి (పెద్దగట్టు) ఆలయ కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛం అందజేసి, ఫిబ్రవరిలో జరిగే జాతరకు రావాలని మంత్రులను కోరారు. జాతర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యుడు కొప్పుల వేణారెడ్డి, పెద్దగట్టు ఆలయ కమిటీ చైర్మన్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, పోలేబోయిన నరేష్ యాదవ్, కుర్ర సైదులు, వీరబోయిన సైదులు యాదవ్, మెంతబోయిన లింగస్వామి, మెంతబోయిన చిన్న మల్లయ్య, సిరపంగి సైదమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment