ఆందోళన అవసరం లేదు
నల్లగొండ : ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అర్హుల జాబితాలో పేర్లు లేనివారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ పథకాలన్నీ నిరంతరం కొనసాగుతాయని.. కలెక్టర్ ఇలా త్రిపాఠి పేర్కొన్నారు. సోమవారం గ్రీవెన్స్‌డే సందర్భంగా కలెక్టరేట్‌లో ఆమె ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమై మాట్లాడారు. గ్రామసభల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీపీఓ వెంకయ్యను ఆదేశించారు. అర్హుల జాబితాకు సంబంధించి ఎంపీడీఓ అన్ని ఏర్పాట్లు పరిశీలించుకోవాలన్నారు. అర్హుల జాబితాను గ్రామసభల్లో చదివి వినిపించి ఆమోదం పొందాలని సూచించారు. రేషన్ కార్డుల వివరాలను ఎంపీడీఓ లాగిన్ ద్వారా జిల్లాస్థాయికి, తర్వాత రాష్ట్రస్థాయికి పంపాలన్నారు. ఇది వరకే రేషన్ కార్డుల్లో కొత్తగా పేర్లు జోడించేందుకు వచ్చిన వాటిని తహసీల్దార్ లాగిన్ ద్వారా డీఎస్‌ఓ, కలెక్టర్ నుంచి రాష్ట్రస్థాయికి పంపాల్సి ఉంటుందన్నారు. పేర్ల జోడింపునకు సంబంధించి జిల్లాలో సుమారు 77 వేల దరఖాస్తులు లాగిన్‌లో ఉన్నాయని, వీటన్నింటినీ గ్రామసభలో చదివి వినిపించాలని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హత ఉండి జాగా ఉన్న వారి జాబితా, జాగా లేక ఇందిరమ్మ ఇల్లు పొందేందుకు అర్హత గల వారి జాబితాను వేరువేరుగా చదివి వినిపించాలని అధికారులను ఆదేశించారు. ఈ పథకాలకు కొత్తగా వచ్చే దరఖాస్తులను స్వీకరించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఎవరికై నా భూమి ఉన్నట్లు అభ్యంతరాలు వస్తే వాటిని 10 రోజుల్లో పరిష్కరించాలన్నారు. ప్రజా వాణి దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజన్, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఏఓ శ్రవణ్‌కుమార్, హౌజింగ్ పీడీ రాజ్‌కుమార్, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఫ పథకాలన్నీ నిరంతరం కొనసాగుతాయి
ఫ గ్రామసభల్లోనూ దరఖాస్తులు చేసుకోవచ్చు
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి
Comments
Please login to add a commentAdd a comment