ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తా
కనగల్ : భక్తుల పాలిట కొంగుబంగారం దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దర్వేశిపురం రేణుకా ఎల్లమ్మ దేవాలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాలకవర్గం.. దేవుడికి, భక్తులకు అనుసంధానంగా ఉండాలన్నారు. దేవాలయానికి నల్లగొండ నుంచే కాకుండా, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చే విధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. కలెక్టర్ తన కుమరుడి తలనీలాలు ఈ ఆలయంలో సమర్పించడం గొప్ప విషయమన్నారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా 15 రోజుల్లో అంతర్గత రహదారులు మంజూరు చేసి.. పూర్తి చేయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఏసీ భాస్కర్, ఈఓ జయరామయ్య, చైర్మన్ చీదేటి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు దేవిరెడ్డి వెంకట్‌రెడ్డి, భారత వెంకటేశం, గోలి జగాల్‌రెడ్డి, గుండెబోయిన భిక్షం, కూసుకుంట్ల రాజిరెడ్డి, దేప కర్ణాకర్‌రెడ్డి, కెసాని వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఫ దర్వేశిపురం ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం
ఫ్లైఓవర్ నిర్మాణం అపోహే..
అర్వపల్లి – తానంచర్ల రహదారిపై అర్వపల్లి వద్ద ఫ్లైఓవర్ కోసం భూములు పోతున్నాయని అపోహలను సృష్టిస్తున్నారని, ఇది నిజం కాదన్నారు. అర్వపల్లి వద్ద ప్రమాదాల నివారణకు జంక్షన్ అభివృద్ధి పనులు మాత్రమే చేపట్టేందుకు సర్వే నిర్వహిస్తున్నామన్నారు. అక్కడ ఎలాంటి ఫ్లై ఓవర్ నిర్మించడం లేదన్నారు. జిల్లా అభివృద్ధిలో భాగంగా త్వరలోనే రూ.900 కోట్లతో ఏఎమ్మార్పీ ప్రధాన కాలువ, డిస్ట్రిబ్యూటరీల లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఎంజీ యూనివర్సిటీలో నాలుగు భవనాల నిర్మాణ పనులు నడుస్తున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment